'సలార్' సీక్వెల్‌కి అదిరిపోయే టైటిల్.. అసలు కథంతా ఇందులోనే! | Sakshi
Sakshi News home page

Salaar Movie Part 2: మెయిన్ స్టోరీ అంతా పార్ట్-2లోనే.. ఇలా ఉండబోతుందా?

Published Fri, Dec 22 2023 4:00 PM

Prabhas Salaar Movie Part 2 Title And Story Details - Sakshi

డార్లింగ్ ప్రభాస్.. ఫ్యాన్స్ ఆకలి తీర్చేశాడు. 'సలార్' దెబ్బకు థియేటర్లన్నీ మాస్ మేనియాతో హోరెత్తిపోతున్నాయి. అయితే థియేటర్లలో 'సలార్: పార్ట్-1' చూసిన తర్వాత కొందరు ఫుల్ జోష్‌లో ఉండగా, మరికొందరు మాత్రం కథ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే అసలు స్టోరీ అంతా సీక్వెల్‌లోనే ఉండనుందని తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే?

గత కొన్నాళ్ల నుంచి సీక్వెల్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. 'సలార్'ని కూడా అలా రెండు భాగాలుగా విడగొట్టారు. అయితే తాజాగా రిలీజైన పార్ట్-1లో దేవ పాత్రలో ప్రభాస్‌ని చూపించారు. ఆద్య(శృతి హాసన్)ని విలన్స్ బారి నుంచి కాపాడటం లాంటి సీన్స్‌తో ఫస్టాప్.. వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) కోసం ఎంతకైనా తెగించే ప్రాణ స్నేహితుడు దేవాగా ప్రభాస్‌ని సెకండాఫ్‌లో చూపించారు. చివర్లో సీక్వెల్‌కి 'సలార్: శౌర్వంగ పర్వం' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)

ఇప్పుడు రిలీజైన 'సలార్ పార్ట్-1: సీజ్‌‌ఫైర్'లో చాలావరకు ప్రశ్నలు వదిలేశారు. శౌర్వంగ పర్వం అంటే ఏంటి? బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దేవా-వరదా ఎందుకు బద్ధ శత్రువులుగా మారారు? ఖాన్సార్ సామ్రాజ్యానికి ఎవరు కింగ్ అవుతారు? ఆద్య(శృతిహాసన్)ని ప్రభాస్ ఎందుకు రక్షిస్తున్నాడు? ప్రభాస్ తల్లి (ఈశ్వరీ రావు) అతడిని ఎందుకు కట్టడి చేస్తోంది? ఇలాంటి చాలా కీ పాయింట్స్ అన్నింటికీ సమాధానాలన్నీ పార్ట్-2లో చూపించబోతున్నారు.

 

అయితే 'సలార్' పార్ట్-2కి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయిందట. కొన్ని సీన్స్ మాత్రమే తీయాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 'కల్కి' మూవీతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్.. తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో చేయాల్సి ఉంది. దీనిబట్టి చూస్తే.. 'సలార్ పార్ట్-2' రిలీజ్ ఎప్పుడవుతుందో ఏంటనేది? క్లారిటీ రావాల్సి ఉంది. అలానే ఇప్పుడొచ్చిన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సీక్వెల్‌లో కొత్తగా ఇంకేమైనా కొత్త పాత్రలు వస్తాయనేది చూడాలి?

(ఇదీ చదవండి: Salaar: ఆ ఓటీటీలోనే సలార్‌! దిమ్మతిరిగే రేటుకు..)

 
Advertisement
 
Advertisement