కేవలం పది రోజుల్లోనే అన్ని కోట్లు రాబట్టిన సలార్‌.. | Prabhas Salaar Part 1 Ceasefire Movie 10 Days World Wide Box Office Collections Crossed Rs 600 Crores - Sakshi
Sakshi News home page

Salaar Movie Collections: సలార్‌ ర్యాంపేజ్‌.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published Mon, Jan 1 2024 5:00 PM

Prabhas Salaar Movie 10 Days Collections - Sakshi

కంటెంట్‌ బాగుంటే హిట్‌ టాక్‌ దానంతటదే వస్తుంది. అదే కంటెంట్‌కు కటౌట్‌ యాడ్‌ అయితే కలెక్షన్ల మోత మోగాల్సిందే! సలార్‌ విషయంలో ముమ్మాటికీ అదే జరిగింది. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సలార్‌. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ.500 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా ఈ మూవీ ఇప్పటివరకు ఎంత రాబట్టిందో తెలియజేస్తూ ఓ పోస్టర్‌ వదిలింది చిత్రయూనిట్‌.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లు వసూలు చేసిందని వెల్లడించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.600 ‍కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేసి అరుదైన ఘనత సొంతం చేసుకుంది సలార్‌. ఇక బాలీవుడ్‌లో షారుక్‌ ఖాన్‌ డంకీ మూవీ రిలీజవగా ఆ పోటీని తట్టుకుని అక్కడ కూడా మంచి కలెక్షన్సే రాబట్టింది. మరి రానున్న రోజుల్లో సలార్‌ ఇంకా ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి!

చదవండి: రూ.75 కోట్లు పెట్టి పాత బంగ్లా కొన్న 'పఠాన్‌' విలన్‌

Advertisement
 
Advertisement