ప్రభాస్‌, పవన్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, బన్నీ తీసుకునే రెమ్యునరేషన్‌ ఎంత?

Prabhas, Pawan Kalyan, NTR, Others Tollywood Stars Remuneration - Sakshi

స్టార్‌ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు అనేది ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్‌ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్‌పై  ఓ లుక్కేద్దాం.

ప్రభాస్‌ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోల్లో అందరికంటే ముందున్నాడు. బాహుబలి తర్వాత నటించిన సాహో, రాధేశ్యామ్‌ డిజాస్టర్స్‌గా మిగిలినా..  ప్రభాస్‌ ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమాలు చేయడానికి పాన్‌ ఇండియా దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. అందుకే రెమ్యునరేషన్‌ని పెంచేశాడట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు తీసుకుంటూ.. టాలీవుడ్‌ నుంచి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో మొదటి స్థానంలో ఉన్నాడు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. మహేశ్‌తో సినిమా తీస్తే.. లాభాలు పక్కా అనే నమ్మకం టాలీవుడ్‌లో ఉంది. అందుకే ఆయనతో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతుంటారు. సర్కారు వారి పాట విజయం తర్వాత మహేశ్‌ తన రెమ్యునరేషన్‌ పెంచేశాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ తో పాటు హరీష్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ లోనూ నటిస్తున్నాడు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ఈ సినిమా కంటే ముందు రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకునే ఎన్టీఆర్‌.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్టీఆర్‌ ఒక్కడే కాడు రామ్‌ చరణ్‌ కూడా పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ.40 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడట. 

పుష్ప తర్వాత అల్లు అర్జున్‌ తన రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేశాడట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 60 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుంటున్నాడట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top