
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈనెల 27న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి అదే రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది.
మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ పోస్ట్ చేసింది. నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది. కాగా.. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.
𝐋𝐞𝐭’𝐬 𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞 𝐂𝐢𝐧𝐞𝐦𝐚…❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/Xqn7atEWNF
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 28, 2024