Prabhas Unveils Interesting Details at Adipurush Pre-release Event in Tirupati - Sakshi
Sakshi News home page

పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా.. ఆదిపురుష్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌

Jun 6 2023 11:51 PM | Updated on Jun 7 2023 10:11 AM

Prabhas Comments At Adipurush Pre Release Event At Tirupati - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం తిరుపతిలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

ప్రభాస్ మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం మొదటిసారి 3డీ ట్రైలర్ ఫ్యాన్స్ చూడాలని డైరెక్టర్‌కు గట్టిగా చెప్పా. ట్రైలర్ చూసి అభిమానులు ఇచ్చిన ప్రొత్సాహమే మమ్మల్ని ఇంత దాక నడిపించింది.

నన్ను ఒకసారి చిరంజీవి గారు కలిసినప్పుడు రామాయణం చేస్తున్నావా అని అడిగారు. నేను అవునంటే దానికి ఆయన రామాయణం చేయాలంటే అదృష్టం ఉండాలన్నారు. నిజంగానే ఆదిపురుష్ సినిమా కాదు నా అదృష్టం.

ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను. తక్కువ మాట్లాడుతా ఎక్కువ సినిమాలు చేస్తాను అన్నారు. అభిమానులు పెళ్లి ఎప్పుడని అడగగా దానికి సమాధానంగా 'ఇక‍్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను ఎప్పుడైనా' అని అన్నారు. ఇక ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement