కెరీర్ ఖతం అన్నారు.. కానీ ఎట్టకేలకు హీరోయిన్‌గా ఓ ఛాన్స్! | Pooja Hegde In Simbu's Latest Tamil Movie | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఫ్లాపుల బ్యూటీకి సౌత్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్!

Feb 3 2024 3:20 PM | Updated on Feb 3 2024 3:34 PM

Pooja Hegde In Simbu Latest Tamil Movie - Sakshi

పూజా హెగ్డే.. అప్పట్లో వరస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అరవింద సమేత, అల వైకుంఠపురములో తదితర చిత్రాలతో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ.. ఇ‍ప్పుడు మాత్రం ఛాన్సుల్లేక పూర్తిగా ఇంటికే పరిమితమైపోయింది. ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అని అందరూ అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

కానీ ఈమెకు ఇప్పుడు ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ప్రముఖ తమిళ హీరో శింబు ప్రస్తుతం దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శింబు పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఈ పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమా కోసమే శింబు.. లండన్‌కు వెళ్లి మరీ కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. అలానే ఈ మూవీలో హీరోయిన్లుగా దీపికా పదుకొనే, కీర్తీ సురేశ్‌ నటిస్తారని టాక్ నడిచింది. కానీ కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ కాగా మరో కథానాయికగా పూజా హెగ్డేకి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement