సింపుల్‌గా గుడిలో నటుడి కూతురి పెళ్లి.. ఆశీర్వదించిన మోదీ | Sakshi
Sakshi News home page

Suresh Gopi: ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి.. ముఖ్య అతిథిగా మోదీ

Published Wed, Jan 17 2024 12:09 PM

PM Narendra Modi Attends Suresh Gopi's Daughter Bhagya Wedding - Sakshi

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్‌ గోపీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూతురు భాగ్య సురేశ్‌.. శ్రేయాస్‌ మోహన్‌తో ఏడడుగులు నడిచింది. వీరి వివాహం బుధవారం (జనవరి 17) ఉదయం కేరళలోని గురువాయూర్‌ ఆలయంలో చాలా సింపుల్‌గా జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి ప్రధాన నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

30 జంటలకు మోదీ ఆశీర్వాదాలు
ఈ సందర్భంగా అక్కడున్న అందరినీ చిరునవ్వుతో పలకరించారు. అనంతరం మోదీ.. తన చేతుల మీదుగా నూతన వధూవరులు పూలదండలు మార్చుకునే కార్యక్రమాన్ని జరిపించారు. తర్వాత కొత్త జంట.. తమను ఆశీర్వదించండంటూ మోదీ పాదాలకు నమస్కరించింది. వీరితో పాటు అదే ఆలయంలో పెళ్లి చేసుకున్న మరో 30 కొత్త జంటలను మోదీ ఆశీర్వదించారు.

స్టార్‌ సెలబ్రిటీల సందడి
కాగా సినీతారలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌, దిలీప్‌, ఖుష్బూ, జయరాం తదితర సెలబ్రిటీలు కుటుంబంతో సహా విచ్చేసి ఈ పెళ్లి మండపంలో సందడి చేశారు. వివాహ వేడుకల అనంతరం రిసెప్షన్‌ కోసం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వారి కుటుంబసభ్యులు సహా బంధుమిత్రులంతా వేరే ఆడిటోరియానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సురేశ్‌ గోపి కూతురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: బీడీల మీద బీడీలు తాగిన మహేశ్‌.. అసలు విషయం ఇదా!

whatsapp channel

Advertisement
 

తప్పక చదవండి

Advertisement