
ఈ ఏడాది ఇప్పటికే ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ సినిమాలతో వచ్చిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పుడు మరో చిత్రాన్ని రెడీ చేశాడు. 'హృదయపూర్వం' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ఓనం పండగ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే మూవీపై ఆసక్తి కలిగిస్తోంది.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)
యాక్షన్, థ్రిల్లర్ అంటూ గత రెండు చిత్రాలతో వచ్చిన మోహన్ లాల్ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో నవ్వించబోతున్నాడు. టీజర్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కి జోడీగా మాళవిక మోహనన్ నటించింది. అలానే 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్ర పోషించాడు. సత్యన్ అంతికాడ్ దర్శకుడు. టీజర్ చూస్తుంటే మోహన్‌లాల్‌కి మరో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)