అది నేను కాదు.. టాలీవుడ్ హీరోయిన్ పేరుతో మోసం | A Person Dupe Photographers By Using Aditi Rao Hydari Name | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: నాకు పర్సనల్ ఫోన్ నంబర్ లేదు

Nov 16 2025 3:59 PM | Updated on Nov 16 2025 4:06 PM

A Person Dupe Photographers By Using Aditi Rao Hydari Name

తెలంగాణలోని వనపర్తి సంస్థానికి చెందిన అదితీ రావు హైదరీ ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తోంది. హీరో సిద్దార్థ్‌ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈమె పేరు చెప్పి ఓ వ్యక్తి.. పలువురు ఫొటోగ్రాఫర్స్‌ని మోసం చేస్తున్నాడు. ఇది అదితీ దృష్టికి వచ్చేసరికి స్వయంగా దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి హెచ్చరించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి జాన్వీ కపూర్ కొత్త సినిమా)

'వాట్సాప్‌లో నా పేరుతో ఎవరో ఓ వ్యక్తి.. ఫొటోషూట్స్ కోసం పలువురు ఫొటోగ్రాఫర్స్‌కి మెసేజులు చేస్తున్నాడు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే అది నేను కాదు. ఇలా నేను మెసేజ్ చేయను. చెప్పాలంటే నాకు వ్యక్తిగత ఫోన్ నంబర్ ఏం లేదు. నా టీమ్ ద్వారా నేను సంప్రదిస్తాను. కాబట్టి ఆ నంబర్ నుంచి మెసేజులు ఏమైనా వస్తే స్పందించొద్దు' అని అదితీ రావ్ హైదరీ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. సదరు మోసగాడి నంబర్ కూడా వెల్లడించింది.

2006 నుంచి అదితీ సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో నటించింది. టాలీవుడ్‌లో 'సమ్మోహనం' ఈమెకు తొలి మూవీ. తర్వాత అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లో నటించింది. 'సమ్మోహనం'తో హిట్ కొట్టినప్పటికీ మిగిలనవన్నీ ఫెయిల్ అయ్యాయి. 'మహాసముద్రం'లో నటిస్తున్న టైంలో హీరో సిద్ధార్థ్‌తో అదితీ ప్రేమలో పడింది. తర్వాత మూడేళ్ల పాటు ప్రేమించుకుని 2024లో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

(ఇదీ చదవండి: 'వారణాసి'లో శ్రీరాముడిగా మహేశ్.. రాజమౌళి కామెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement