మంచి కథతో పెదకాపు రూపొందింది | Peddha Kapu Part 1 Trailer Launch | Sakshi
Sakshi News home page

మంచి కథతో పెదకాపు రూపొందింది

Sep 12 2023 3:55 AM | Updated on Sep 12 2023 7:08 AM

Peddha Kapu Part 1 Trailer Launch - Sakshi

‘‘పెదకాపు 1’ ట్రైలర్‌ చాలా బాగుంది. రవీందర్‌ రెడ్డిగారు తన బావమరిదిని, పైగా కొత్త హీరోని పెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్‌ వీవీ వినాయక్‌. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ విడుదల చేయగా, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ– ‘‘పెదకాపు’ మా యూనిట్‌కి మరపురాని చిత్రంగా నిలిచి, ‘పెదకాపు 2’కి ప్రస్థానం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సినిమా మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను’’ అన్నారు మిర్యాల రవీందర్‌ రెడ్డి. ‘‘నాకింత మంచి కథ ఇచ్చిన శ్రీకాంత్‌, నిర్మించిన రవీందర్‌ రెడ్డిగార్లకు రుణపడి ఉంటా’’ అన్నారు విరాట్‌ కర్ణ. కెమెరామేన్‌ ఛోటా కె. నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement