Pathaan Box Office Collection: All Time Highest Grossing Film In Hindi - Sakshi
Sakshi News home page

Pathaan Movie: బాక్సాఫీస్‌ రికార్డులు బద్ధలు.. దంగల్‌ వెనక్కి.. మొదటి స్థానంలో పఠాన్‌!

Feb 5 2023 12:27 PM | Updated on Feb 5 2023 1:33 PM

Pathaan Box Office Collection: All Time Highest Grossing Film In Hindi - Sakshi

పీకే, టైగర్‌ జిందా హై సినిమాలను దాటేసిన పఠాన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా దంగల్‌ను సైతం అధిగమించింది. రూ.729

బాలీవుడ్‌ పని అయిపోయింది.. హిందీ స్టార్‌ హీరోలు ఇక రిటైర్మెంట్‌ తీసుకోవాల్సిందే! వాళ్ల సినిమాలకు కలెక్షన్లు రావడం ఇక కలే.. ఈ మాటలన్నింటికి పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్‌ ఖాన్‌. వందల కోట్లు కొల్లగొడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్‌ బాయ్‌కాట్‌ గ్యాంగ్‌ నోరు మూయించాడు. తాజాగా మరో రికార్డు బద్ధలు కొట్టాడు షారుక్‌.

ఇప్పటికే పీకే, టైగర్‌ జిందా హై సినిమాలను దాటేసిన పఠాన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా దంగల్‌ను సైతం అధిగమించింది. రూ.729 కోట్లతో వరల్డ్‌వైడ్‌ భారీ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నిజానికి దంగల్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కానీ ఇందులో అధిక వాటా చైనాదే! అక్కడ హిందీలో కాకుండా మాండరిన్‌ భాషలో రిలీజ్‌ చేయగా రూ.1200 కోట్ల పైనే రాబట్టింది. ఇక పఠాన్‌ విషయానికి వస్తే.. షారుక్‌ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా సల్మాన్‌ అతిథి పాత్రలో మెరిశాడు.

చదవండి: వాణి జయరామ్‌ పోస్ట్‌మార్టమ్‌ పూర్తి

Advertisement
 
Advertisement
Advertisement