కొత్తిల్లు కొన్న డాక్టర్‌బాబు.. గృహప్రవేశం ఫోటోలు వైరల్‌ | Paritala Nirupam And Manjula New Housewarming Ceremony On Srirama Navami, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Nirupam-Manjula Housewarming Ceremony: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం

Apr 18 2024 12:37 PM | Updated on Apr 18 2024 1:03 PM

Paritala Nirupam, Manjula New Housewarming on Srirama Navami - Sakshi

బుల్లితెర డాక్టర్‌బాబు కొత్తిల్లు కొన్నాడు. భార్య మంజులతో కలిసి నటుడు పరిటాల నిరుపమ్‌ కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. ఈ ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డ్రీమ్‌ హోమ్‌ సాకారమైందంటూ కొన్ని ఫోటోలు పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటోతో నిరుపమ్‌.. మంగళహారతితో మంజుల కుడికాలు పెట్టి నూతన ఇంట్లోకి అడుగుపెట్టారు.

శ్రీరామనవమి రోజే నూతన ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తోంది. కొత్తిల్లు కొన్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మంజుల- నిరుపమ్‌ ఎన్నో ఏళ్లుగా సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిరుపమ్‌ అయితే.. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు. తన యాక్టింగ్‌ స్కిల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ధారావాహికల ద్వారానే కాకుండా టీవీ షోలలోనూ తరచూ పాల్గొంటుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement