breaking news
Manjula Paritala
-
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట
బుల్లితెర డాక్టర్‌బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్‌తో ఫేమ్ తెచ్చకున్న నటుడు నిరుపమ్. తన సహనటి మంజులనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. టాలీవుడ్‌లోని ఫేమ్ ఉన్న బుల్లితెర జంటల్లో వీరిద్దరు ముందుంటారు.తాజాగా ఈ జంట ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఎంజీ బ్రాండ్‌కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. నా కొత్త కారు అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను నటి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.కాగా.. చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Manjula Paritala (@manjula_paritala_official) -
కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
-
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
కొత్తిల్లు కొన్న డాక్టర్‌బాబు.. గృహప్రవేశం ఫోటోలు వైరల్
బుల్లితెర డాక్టర్‌బాబు కొత్తిల్లు కొన్నాడు. భార్య మంజులతో కలిసి నటుడు పరిటాల నిరుపమ్ కొత్తింట్లోకి గృహప్రవేశం చేశాడు. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. డ్రీమ్ హోమ్ సాకారమైందంటూ కొన్ని ఫోటోలు పంచుకోగా అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. శ్రీరాముడి పట్టాభిషేకం ఫోటోతో నిరుపమ్.. మంగళహారతితో మంజుల కుడికాలు పెట్టి నూతన ఇంట్లోకి అడుగుపెట్టారు. శ్రీరామనవమి రోజే నూతన ఇంట్లో పాలు పొంగించినట్లు తెలుస్తోంది. కొత్తిల్లు కొన్న ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మంజుల- నిరుపమ్ ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిరుపమ్ అయితే.. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు. తన యాక్టింగ్ స్కిల్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ధారావాహికల ద్వారానే కాకుండా టీవీ షోలలోనూ తరచూ పాల్గొంటుంటారు. View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) -
ప్రేమించి పెళ్లి చేసుకున్ :పరిటాల మంజుల
పాలకొల్లు అర్బన్ : చంద్రముఖి సీరియల్లో నటించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అభిమానిగా మారడంతోపాటు తెలుగింటి కోడలినయ్యానని టీవీ సీరియల్ నటి పరిటాల మంజుల అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ షూటింగ్ నిమిత్తం పాలకొల్లు విచ్చేసిన ఆమె విలేకరులతో ముచ్చటించారు. బుల్లితెర నటిగా ఎలా అవకాశాలొచ్చాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కన్నడంలో కొత్త నటీనటులతో సీరియల్ తీస్తున్నారని మా నాన్న మిత్రుడొకరు చెప్పారు. ఫొటో షూట్‌కి వెళ్లి తొలి ప్రయత్నంలోనే హీరోయిన్ పాత్ర దక్కించుకున్నాను. తెలుగులో బుల్లితెరకు ఎలా పరిచయమయ్యారు బెంగళూరులో ఆర్కా మీడియా సంస్థ ద్వారా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలి సీరియల్ చంద్రముఖి. కుటుంబ నేపథ్యం నాన్న శివశంకర్ పోలీస్. అమ్మ పుష్ప గృహిణి. మేం నలుగురు ఆడపిల్లలం. నేను రెండో సంతానం. నాల్గో చెల్లి కీర్తి కూడా బుల్లితెర నటి. ఎన్ని సీరియల్స్ నటించారు కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి, తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు అన్నీ హీరోయిన్ పాత్రలే చేశా. కాంచనగంగలో విలన్ పాత్ర పోషించా. పేరుతెచ్చిన సీరియల్ చంద్రముఖి, 1,850 ఎపిసోడ్లతో ఆరున్నరేళ్లు సాగింది. మీది ప్రేమ వివాహమా నా సహచర నటుడు, సినీ రచయిత ఓంకార్ కుమారుడు నిరుపమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అవార్డులు మాటే ంటి చంద్రముఖికి నాలుగు అవార్డులు అందుకున్నా. కాంచనగంగలో పాత్రకు పురస్కారం దక్కింది. డ్రీమ్ రోల్ ఒకే సీరియల్లో రెండు విభిన్న పాత్రలు (హీరోయిన్, విలన్) చేయాలని ఉంది.


