మోస్ట్‌ పాపులర్‌ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే! | Ormax Media Released Top Ten Film Stars In September Month | Sakshi
Sakshi News home page

Ormax Media: మోస్ట్‌ పాపులర్‌ హీరోగా విజయ్.. హీరోయిన్లలో ఆమెనే టాప్!

Oct 22 2024 4:15 PM | Updated on Oct 22 2024 4:34 PM

Ormax Media Released Top Ten Film Stars In September Month

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్‌ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్‌ పేరిట టాప్‌ టెన్‌ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.

తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్‌ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?

ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్‌ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.

కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్‌లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement