‘ఊరు పేరు భైరవకోన’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం: సందీప్‌ కిషన్‌ | Sakshi
Sakshi News home page

‘ఊరు పేరు భైరవకోన’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం.. ఇది నాకు స్పెషల్‌ ఫిల్మ్‌

Published Mon, Feb 12 2024 1:39 AM

Ooru Peru Bhairavakona Movie Release On 16th February - Sakshi

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు స్పెషల్‌ మూవీ.రెండున్నర సంత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నాం. ఫ్యాంటసీ, సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మంచి కమర్షియల్‌ సినిమా ఇది’’ అన్నారు.

‘‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అద్భుతమైన జర్నీ. ఈ సినిమాలోని ప్రతి మూమెంట్‌ మాకు ఓ కొత్త అనుభవం. ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు కథలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు వీఐ ఆనంద్‌. ‘‘ఈ సినిమాతో సందీప్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తాడు’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది. సాంగ్స్, ఆర్‌ఆర్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement