న్యాయం కోసం ప్రేమికుడి పోరాటమే ‘ఒక కోర్టు కేస్‌’ | Oka Court Case Teaser Released By Srikanth | Sakshi
Sakshi News home page

ప్రేమలో మోసపోయిన ఓ యువకుడి న్యాయ పోరాటమే ‘ఒక కోర్టు కేస్‌’

Jun 9 2026 3:46 PM | Updated on Jun 9 2026 3:54 PM

Oka Court Case Teaser Released By Srikanth

సూర్యాన్ష్‌, తనీషా మిశ్రా జంటగా నటించిన సినిమా ‘ఒక కోర్టు కేస్‌’. నాగేష్‌ పూడి, ముకేష్‌ పూడి సమర్పణలో ఓపెన్‌ ఐస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గణేష్‌ పూడి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 17న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ప్రేమలో జరిగే ఘటనలను లీగల్‌ డ్రామాగా మలచడం ఆసక్తిగా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. 

‘‘ప్రేమలో మోసపోయిన ఒక యువకుడు తనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధానాంశం’’ అన్నారు సూర్యాన్ష్‌. ‘‘ప్రేమలో బ్రేకప్‌ తర్వాత జరిగే ప్రతీకారం అనే అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు గణేష్‌ పూడి. ‘‘ఈ కథ విన్నప్పుడే సాధారణ ప్రేమకథ కాదని అర్థమైంది’’ అని తనీషా మిశ్రా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement