'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే? | No Buzz For Kamal Haasan Bharateeyudu 2 Movie | Sakshi
Sakshi News home page

Bharateeyudu 2: హిట్ సినిమాకి సీక్వెలే.. కానీ బజ్ ఎ‍క్కడ?

Jun 2 2024 4:58 PM | Updated on Jun 2 2024 5:30 PM

 No Buzz For Kamal Haasan Bharateeyudu 2 Movie

'విక్రమ్' సినిమాతో విలక్షణ నటుడు కమల్ హాసన్ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. దీంతో పలు భారీ చిత్రాల్లో భాగమయ్యారు. వీటిలో ఒకటే 'ఇండియన్ 2'. 'భారతీయుడు' మూవీకి సీక్వెల్ ఇది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దర్శకుడు-హీరో కలిసి పనిచేశారు. ఇలా చూసుకుంటే అంచనాలు ఏ రేంజులో ఉండాలి? కానీ రియాలిటీలో అలా ఉందా?

(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఆ ఓటీటీలోనే.. వచ్చేది ఎప్పుడంటే?)

ఇప్పుడు సినిమాల విషయంలో భాషతో ఎవరికీ సంబంధం లేదు. మంచి కంటెంట్ ఎక్కడ ఉందా అని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కమల్-శంకర్ కలిసి 1996లో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్ తీశారు. జులై 12న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. రీసెంట్‌గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పర్వాలేదనిపించాయి. పూర్తి ఆల్బమ్ కూడా ఓకే ఓకే అనుకునేలా ఉంది తప్పితే సూపర్ అనే టాక్ రాలేదు. మరోవైపు ఈ మూవీలో హీరోయిన్ కాజల్ సీన్స్ ఏం లేవంట. అంటే సేనాపతికి భార్య క్యారెక్టర్ ఉండదేమో? అలానే తమిళంలో బజ్ ఎలా ఉందో గానీ తెలుగులో మాత్రం పెద్దగా లేదు. ఇప్పటివరకు శంకర్ మార్క్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మూవీ ఒకటుందని సగటు ప్రేక్షకుడికి ఇంకా రిజిస్టర్ కావట్లేదు. విడుదలకు మరోనెల మాత్రమే ఉన్న నేపథ్యంలో 'భారతీయుడు 2' జోరు పెంచాలి!

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

Advertisement
 
Advertisement
Advertisement