సినిమా మీద ప్రేమ తగ్గదు | Nnarayan das narang coments on telugu film industry | Sakshi
Sakshi News home page

సినిమా మీద ప్రేమ తగ్గదు

Jul 27 2020 3:36 AM | Updated on Jul 27 2020 3:36 AM

Nnarayan das narang coments on telugu film industry - Sakshi

నారాయణదాస్‌ నారంగ్

‘‘ముప్పై ఏళ్లుగా ఫిల్మ్‌ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. చిత్రపరిశ్రమ నాకు తల్లిలాంటిది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టింది. వాటిని సక్రమంగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను’’ అని నిర్మాత, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు నారాయణదాస్‌ నారంగ్‌ అన్నారు. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థను ప్రారంభించి 30 ఏళ్లుగా చిత్ర పంపిణీ రంగంలో కొనసాగుతున్న నారాయణదాస్‌ నారంగ్‌ పుట్టినరోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటిదాకా దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశాను.

అందులో చిత్ర పరిశ్రమ గర్వించే ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలు ఉండటం విశేషం. సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాను. ఎమిగోస్‌ క్రియేష¯Œ్స, పి. రామ్మోహన్‌ రావుతో కలిసి ‘లవ్‌ స్టోరీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా 15 రోజులు షూటింగ్‌ చేయాల్సి ఉంది. మా తర్వాతి సినిమా కూడా శేఖర్‌ కమ్ములతోనే చేయబోతున్నాం. ఇందులో ఒక పెద్ద హీరో నటిస్తారు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement