
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పరిచయం అక్కర్లేదు.చెన్నైకి చెందిన ముద్దుగుమ్మ మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలోనూ మెరిసింది. అయితే ఇటీవల నివేదాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలైంది.
కారులో వెళ్తుండగా ఆమె కారును పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారితీసింది. ఏకంగా పోలీసులతోనే వాగ్వావాదానికి దిగింది. ఇది నా పరువుకు సంబంధించిన విషయం అంటూ పోలీసులతో వాదించింది. దీంతో అసలేం జరిగిందంటూ ఆడియన్స్ సైతం నెట్టింట తెగ ఆరా తీశారు. కొందరేమో మూవీ ప్రమోషన్స్ అని కొట్టిపారేయగా.. మరికొందరు ఇంకా ఏదో జరిగి ఉంటుందని ఎవరికీ వారు ఊహించేసుకున్నారు.
తాజాగా దీని వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగమేనని తేలిపోయింది. తాజాగా ఈ విషయాన్ని జీ5 ట్వీట్ చేసింది. పరువు పేరుతో తీసిన చిత్రంలో నివేదా పేతురాజ్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సినిమాను జూన్ 14నుంచి జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా మూవీ ప్రమోషన్ స్టంట్ అని తేలడంతో నెటిజన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Here you go! Not caught in the act, but really one for our latest original #PARUVUonZee5@GoldBoxEnt @sushkonidela @NagaBabuOffl #vishnulaggishetty @saranyapotla @Nivetha_Tweets @nareshagastya @patnaikpraneeta #AmitTiwari @pavansadineni @siddharth_vox @Rajvadlapati pic.twitter.com/z0ILXhKE7w
— ZEE5 Telugu (@ZEE5Telugu) May 31, 2024