
Nivetha Pethuraj In Chiranjeevi Mega 154 Movie Directed By Bobby: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. యంగ్ హీరోలకన్నా తనేమి తక్కువ కాదంటూ మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న చిరంజీవి మరో చిత్రం భోళా శంకర్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం ఒకటి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఇందులో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: అన్నదమ్ముల పాత్రల్లో చిరు, రవితేజ ? 'అన్నయ్య' మళ్లీ రిపీట్ !
మెగా 154వ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తున్నట్లు మహిళా దినోత్సవం రోజున మేకర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో రవితేజకు జోడిగా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో చిరంజీవి, రవితేజ అన్నదమ్ముల పాత్రలో అలరించనున్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ అన్నదమ్ముల రోల్స్‌లో కనిపించినట్లే. గతంలో అన్నయ్య చిత్రంలో చిరంజీవితో కలిసి రవితేజ నటించారు.
చదవండి: సినిమా టికెట్ల రేట్ల సవరణ.. స్పందించిన చిరంజీవి