Chiranjeevi Ravi Teja: అన్నదమ్ముల పాత్రల్లో చిరు, రవితేజ ? 'అన్నయ్య' మళ్లీ రిపీట్‌ !

Chiranjeevi Ravi Teja As Brothers In Director Bobby Movie - Sakshi

Chiranjeevi Ravi Teja As Brothers In Director Bobby Movie: టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చిరు తన సినిమాలతో అభిమానులకు మాస్‌ ఫీస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చిరు తనయుడి రామ్‌ చరణ్‌తో నటించిన 'ఆచార్య' మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతోపాటు గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను పరిశీలిస్తోందట చిత్రబృందం. వైజాగ్‌ షిప్‌ యార్డ్ నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. 

అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా రవితేజ అలరించనున్నాడని సమాచారం. రవితేజ పాత్ర సుమారు 40 నిమిషాలు ఉంటుందని పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సుమారు 22 ఏళ్ల తర్వాత చిరు, రవితేజ కలిసి మరోసారి అన్నదమ్ముల పాత్రలో అలరించున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం 'అన్నయ్య'లో చిరంజీవి, రవితేజ, వెంకట్‌ అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి అండర్‌ కవర్‌ పోలీస్‌ పాత్రలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top