హైదరాబాద్‌లో స్వయంభూ | Nikhil Swayambhu Movie First Look Poster Released | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో స్వయంభూ

Jun 2 2024 12:40 AM | Updated on Jun 2 2024 12:40 AM

Nikhil Swayambhu Movie First Look Poster Released

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘స్వయంభూ’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. కాగా శనివారం (జూన్‌ 1) నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభూ’ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

‘‘ఈ చిత్రంలో లెజెండరీ వారియర్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు నిఖిల్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో జరుగుతోంది. ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్‌’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్‌  కేకే సెంథిల్‌ కుమార్‌ ‘స్వయంభూ’లో తన మ్యాజిక్‌ చూపించనున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement