The India House: స్వాతంత్య్రానికి పూర్వం.. | Sakshi
Sakshi News home page

The India House: స్వాతంత్య్రానికి పూర్వం...

Published Mon, May 29 2023 3:34 AM

Nikhil Siddhartha and Anupam Kher to lead The India House - Sakshi

‘ది ఇండియా హౌస్‌’ లోకి నిఖిల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్‌ హీరోగా అనుపమ్‌ ఖేర్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటించనున్న తాజా చిత్రం ‘ది ఇండియా హౌస్‌’. ‘జై మాతా ది’ అనేది ఉపశీర్షిక. వి మెగా పిక్చర్స్, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రామ్‌చరణ్, విక్రమ్‌ రెడ్డి, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌ సావర్కర్‌ 140వ జయంతి సందర్భంగా ‘ది ఇండియా హౌస్‌’ సినిమా ప్రకటన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు రామ్‌చరణ్, అభిషేక్‌ అగర్వాల్‌. ఈ సినిమాలో శివ పాత్రలో నిఖిల్, సయామీ కృష్ణ వర్మగా అనుపమ్‌ ఖేర్‌ కనిపిస్తారు. ‘‘లండన్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement