నిహారిక టాలీవుడ్‌ బంగారం..: డైరెక్టర్‌ | Niharika Konidela Released Trending Love Movie First Look | Sakshi
Sakshi News home page

Niharika Konidela: ట్రెండింగ్‌ లవ్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన నిహారిక

Nov 6 2024 7:19 PM | Updated on Nov 6 2024 7:29 PM

Niharika Konidela Released Trending Love Movie First Look

వర్ధన్‌ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ట్రెండింగ్‌ లవ్‌.‌ దొరకునా ఇటువంటి ప్రేమ అన్నది ట్యాగ్‌లైన్‌. హరీశ్‌ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ పతాకాలపై సోనుగుప్తా, రూపేశ్‌ డి గోయల్‌ నిర్మిస్తున్నారు.

‘ట్రెండింగ్‌ లవ్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘ట్రెండింగ్‌ లవ్‌ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్‌ కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్‌ ఉన్న దర్శకుడు. మూవీలోని కొన్ని కట్స్‌ చూశాను. చాలా బాగున్నాయి. ఈ టీమ్‌ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకుడు హరీశ్‌ నాగరాజు మాట్లాడుతూ–‘‘ మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీరే రిలీజ్‌ చేయాలని ఒక్క మెసేజ్‌ పెట్టాను.. సరే అని మా టీమ్‌ని ఎంకరేజ్‌ చేయటానికి నిహారిక ముందుకొచ్చారు. నిహారిక వారి పింక్‌ ఎలిఫెంట్‌ సంస్థ టాలెంట్‌ ఉన్న ఎంతోమందికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్‌ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్ సంగీతం అందించాడు.

Advertisement
 
Advertisement
Advertisement