Niharika Konidela Interesting Comments On Keeravani Son Kala Bhairava - Sakshi
Sakshi News home page

Niharika Konidela: బాబు.. నువ్వే మా జీవితంలో వెలుగు నింపావ్‌..నిహారిక పోస్ట్‌ వైరల్‌

Aug 7 2023 12:16 PM | Updated on Aug 7 2023 1:21 PM

Niharika Konidela Interesting Comments On Keeravani Son Kala Bhairava - Sakshi

జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత మెగాడాటర్‌ నిహారిక పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె సోషల్‌ మీడియాలో ఏ పోస్ట్‌ పెట్టిన క్షణాల్లో వైరల్‌ అవుతోంది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, తమ ప్రేవసీని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేసినా.. నిత్యం వీరి విడాకుల ఇష్యూపై ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు నిహారిక కానీ, ఇటు చైతన్య కానీ వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. విడాకుల తర్వాత ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లుగా జీవిస్తున్నారు.

ఇక నిహారిక అయితే స్నేహితులతో కలిసి టూర్స్‌కి వెళ్తూ ఎంజాయ్‌ చేస్తుంది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. గ్లామరస్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తోంది. కెరీర్‌ పరంగా కూడా ఫుల్‌ బిజీ అయింది. ఆ మధ్య డెడ్‌ పిక్సల్‌ అనే వెబ్‌ సీరీస్‌తో అలరించింది. త్వరలోనే ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా విడాకుల తర్వాత నిహారిక మరింత హుషారుగా వ్యవహరిస్తుంది. పెళ్లి జ్ఞాపకాలను మర్చిపోవడానికై ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతోంది.  తాజాగా నిహారిక తన స్నేహితుడి గురించి షేర్‌ చేసిన ఓ  పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

మా జీవితాల్లో వెలుగు తీసుకొచ్చావ్‌
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ, నిహారికలు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. నేడు కాలభైరవ పుట్టిన రోజు . ఈ సందర్భంగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌కి బర్త్‌డే విషేస్‌ తెలియజేస్తూ ఓ ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావ్‌.  థాంక్స్.. లెట్స్ హ్యావ్ ఫన్ డే ’అని  రాసుకొస్తూ.. కాలభైరవతో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement