సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు..

New Turn In Sushant Singh Rajput Suicide Case - Sakshi

బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. ఈ దర్యాప్తు సంస్థ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ (MLAT) కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డాటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. ఇందుకు గానుకాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి చేరుకుంది సీబీఐ. అలాగే నటుడికి సంబంధించిన సోషల్‌ మీడియా అకౌంట్‌, ఈ-మెయిల్‌, లింక్‌ ఏదైనా ఉండిపోయిందా లేదా ధ్రువీకరించాలన‍్నారు. ఈ కేసు పూర్తి చేయడానికి సీబీఐ ఏ చిన్న ఆధారాన్ని కూడా విడిచిపెట్టేలా లేదని తెలుస్తోంది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోయేసరికి డిలీటైన చాట్‌, ఈమేయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ బృందం సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, సీబీఐ అది ఆత్మహత్య లేదా హత్యకు ప్రేరేపణ అని పేర్కొంది. సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత ముంబై పోలీసులు దర్యాప్తు చేసి ఆత్మహత్యగా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్టు అయ్యింది. ఆమె సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందని సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఆరోపించడంతో సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా కాంట్రవర్సీ అయింది. 

చదవండి: దయచేసి నన్ను ఫాలో కావొద్దు

అనంతరం కేసును బెదిరింపు, ప్రేరేపణ కింద నమోదు చేసి ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. సీబీఐకి బదిలీ అయిన తర్వాత సుశాంత్‌ ఇంట్లో ఉన్న సిబ్బంది, రియా, ఆమె సోదరుడు షోవిక్‌ల వాంగ్మూలాలను చాలాసార్లు ఏజెన్సీ నమోదు చేసింది. ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా మరో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్‌ మరణానికి సంబంధించి ఎన్‌సీబీ అనేక మందిని అరెస్టు చేసింది, ఇందులో రియా, ఆమె సోదరుడు షోవిక్ డ్రగ్స్ కేసులో ఉన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన చాట్‌ బయటపడిన తర్వాత దీపికా పదుకొణెతో సహా పలువురు బాలీవుడ్‌ యాక్టర్స్‌ ఏ జాబితాలో చేర్చి విచారణ జరిపారు. 

చదవండి: ‘సుశాంత్ సింగ్‌‌ చావును క్యాష్ ‌చేసుకోవాలనుకుంటున్నారు...!’

నిజానిజాలను వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈ కేసులో సీబీఐ ఇంకా నిర్ధారణకు రాలేదు. దీంతో ఇప్పుడు మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ (MLAT) ద్వారా యూఎస్‌ సహాయం కోరుతోంది. ఈ దర్యాప్తు తర్వాత సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో  మరిన్నికొత్త కోణాలను చూడవచ్చు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top