నువ్వు నా వాడివి: నేహా కక్కర్‌ | Neha Kakkar Shares Pic With Rohanpreet Singh Says You Are Mine | Sakshi
Sakshi News home page

నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా!

Oct 9 2020 1:15 PM | Updated on Oct 9 2020 2:55 PM

Neha Kakkar Shares Pic With Rohanpreet Singh Says You Are Mine - Sakshi

‘‘నేహా.. లవ్‌ యూ సో మచ్‌.. నేను నీ వాడినే’’ నేహా కక్కర్‌పై ప్రేమ కురిపించిన రోహన్‌ప్రీత్‌ సింగ్‌

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ నేహా కక్కర్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. నటుడు రోహన్‌ప్రీత్‌ను ఆమె మనువాడనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెలాఖరున ఢిల్లీలో వీరి వివాహం జరుగనుందని టాక్‌ వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో వీరిద్దరు చేస్తున్న పోస్టుల ఆధారంగా ఈ వదంతులు వ్యాప్తిస్తున్నాయి. వాటికి మరింత బలం చేకూర్చే విధంగా తాజాగా నేహా, రోహన్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేసి.. ‘‘నువ్వు నా వాడివి’’అంటూ క్యాప్షన్‌ జతచేశారు. (చదవండి: ఆదిత్యను అలా ఆటపట్టించాను: ఉదిత్‌ నారాయణ్‌)

అంతేగాక నేహూప్రీత్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ జతచేసి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. ఇందుకు స్పందించిన రోహన్ సైతం అదే ఫొటోను నెటిజన్లతో పంచుకున్నాడు. ‘‘ నా జిందగీ నేహా కక్కర్‌’’ అంటూ ఆమెపై ప్రేమ కురిపించాడు. ‘‘నేహా.. లవ్‌ యూ సో మచ్‌.. నేను నీ వాడినే’’ అంటూ కామెంట్‌ చేశాడు. దీంతో వీళ్లిద్దరి పెళ్లి ఖాయమైనట్లేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు అంటూ ఇప్పటి నుంచే విషెస్‌ చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడక తప్పదని, గతంలో ఇండియన్ ఐడల్ 10 హోస్ట్ ఆదిత్య నారాయణ్‌తో, నేహా పెళ్లి వార్తలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్)‌

కాగా ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో ఆమె నటుడు హిమాన్షు కోహ్లితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తడంతో బ్రేకప్‌ చెప్పుకొన్నారు. ఆ తర్వాత కెరీర్‌పై దృష్టి సారించిన నేహా, పలు ఆల్బమ్స్‌తో అభిమానుల ముందుకొచ్చారు. ఇక రోహన్‌ప్రీత్‌, ముజ్‌ సే షాదీ కరోగీ అనే వెడ్డింగ్‌ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement