విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్‌ | Neha Kakkar Owns House In Rishikesh Says Self Made | Sakshi
Sakshi News home page

విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్‌

Mar 7 2020 10:10 AM | Updated on Mar 7 2020 10:34 AM

Neha Kakkar Owns House In Rishikesh Says Self Made - Sakshi

అద్దె ఇంట్లో అష్టకష్టాలు పడిన పరిస్థితుల నుంచి విలాసవంతమైన బంగ్లా కొనగలిగే స్థాయికి ఎదిగితే ఆ కిక్కే వేరు. అది కూడా.. కష్టార్జితంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటే హృదయం సంతోషంతో నిండిపోతుంది. బాలీవుడ్‌ సింగర్‌ నేహా కక్కర్‌ ప్రస్తుతం అలాంటి ఆనందకర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. సాధారణ వ్యక్తిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నేహా.. ప్రస్తుతం సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆమె.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు.(రెండు వేల నోట్లను పంచిన సింగర్‌)

ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా కక్కర్‌.. తాజాగా తాను ఉత్తరాఖండ్‌లో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘నేను పుట్టినచోట .. రిషికేష్‌లో... ఇది ఇప్పుడు మా బంగ్లా.. గతంలో ఇక్కడే మా కుటుంబం ఒకే ఒక్క గదిలో ఉండేది. అందులోనే ఓ టేబుల్‌ విస్తీర్ణంలో మా ‘కిచెన్‌’ ఉండేది. అది మా సొంత గది కూడా కాదు. దానికి మేం అద్దె కట్టేవాళ్లం. ఇప్పుడు అదే సిటీలో నా సొంత బంగ్లా చూస్తుంటే... ఉద్వేగం ఉప్పొంగుతోంది’’ అంటూ తమ పాత ఇంటి ఫొటోతో పాటు.. కొత్త బంగ్లా ముందు నిల్చున్న ఫొటోను షేర్‌ చేశారు. తను ఈ స్థాయికి చేరడానికి కారణమైన, ఎల్లవేళలా తనకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, మాతా రాణి(అమ్మవారు), శ్రేయోలాభిలాషులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో.. నేహాపై ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘సెల్ఫ్‌ మేడ్‌ వుమెన్‌. మీ కాళ్లపై మీరు నిలబడ్డారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు’’ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (‘నేహను క్షమాపణలు కోరుతున్నా’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement