Neethone Nenu Title Poster Launch - Sakshi
Sakshi News home page

‘సినిమా బండి’ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా ‘నీతోనే నేను’

Jul 28 2023 1:40 PM | Updated on Jul 28 2023 1:46 PM

Neethone Nenu Title Poster Launch - Sakshi

‘సినిమా బండి’ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీతోనే నేను’. మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు  హీరోయిన్లు. అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్‌ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘ఇంత మంచి సినిమాను ఇచ్చిన నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి థాంక్స్. ఆయన ఇంకా ఎన్నో మంచి చిత్రాలు తీయాలని, మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను’అని హీరో వికాస్‌ వశిష్ట అన్నారు.

‘అనుకున్న టైంలోనే సినిమాను కంప్లీట్ చేశాం. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. మా సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం’అని దర్శకుడు అంజి రామ్‌ అన్నాడు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు మోక్ష, కుషిత,  ప్రభాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్, సినిమాటోగ్రాఫర్ మురళీ మోహన్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అకెళ్ల త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement