‘నీతోనే నేను’ చూసి మంచి ఫీలింగ్‌తో బయటకొస్తారు: నిర్మాత | 'Neethone Nenu' Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

‘నీతోనే నేను’ చూసి మంచి ఫీలింగ్‌తో బయటకొస్తారు: నిర్మాత

Oct 11 2023 5:30 PM | Updated on Oct 11 2023 5:52 PM

Neethone Nenu Movie Pre Release Event - Sakshi

‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు  హీరోయిన్లుగా  నటించిన తాజా చిత్రం ‘నీతోనే నేను’. శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన ఈ   చిత్రం అక్టోబ‌ర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని మెద‌క్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ..  ‘కేవ‌లం 33 రోజుల్లోనే ఈ  సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. సింగిల్ షెడ్యూల్‌లో ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. టీచ‌ర్స్ మీద సినిమా చేస్తున్నారేంటి అని ఈ జ‌ర్నీలో న‌న్ను చాలా మంది అడిగారు. అంటే మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌వ‌చ్చు క‌దా అనేది వాళ్ల అభిప్రాయం. కానీ నా ఉపాధ్యాయుల మీద‌, నా క‌థ మీద‌, నా టీమ్ మీద‌, నా మీద నాకు ఉన్న న‌మ్మ‌కంతో ముందుకు అడుగులు వేస్తూ వ‌చ్చాను. అక్టోబ‌ర్ 13న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధం చేశాను. నా టీమ్‌తో క‌లిసి సినిమాను చూశాం. సినిమా చాలా బావుంద‌ని నా టీమ్ స‌భ్యులు చెప్పారు. వంద శాతం సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని సినిమా చూసిన వారు చెబుతున్నారు. అక్టోబర్‌ 13న ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటాను’. 

ద‌ర్శ‌కుడు అంజిరామ్ మాట్లాడుతూ ‘‘మెదక్‌లో ‘నీతోనే నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌టం చాలా ఆనందంగా ఉంది. నాలుగు నెల‌ల పాటు ఎంటైర్ టీమ్ క‌ష్ట‌ప‌డింది. అందువ‌ల్లే సినిమాను అక్టోబ‌ర్ 13న రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌య్యాం. మా సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీ మోహ‌న్ రెడ్డిగారు, మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తీక్‌గారు ఈ జ‌ర్నీలో అందించిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

యాక్ట‌ర్స్‌ హీరో వికాస్ వశిష్ట‌, మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు, ఆకెళ్ల స‌హా  అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఇక నిర్మాత సుధాక‌ర్ రెడ్డిగారైతే మా వెనుకుండి ముందుకు న‌డిపించారు. ఇండ‌స్ట్రీలోకి కొత్త‌గా అడుగు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న డేడికేష‌న్, క‌మిట్‌మెంట్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కి ధ‌న్య‌వాదాలు. కిర‌ణ్‌గారికి, తేజ‌గారికి, ఎడిట‌ర్ ప్ర‌తాప్ స‌హా టీమ్‌కి థాంక్స్‌. అక్టోబ‌ర్ 13న థియేట‌ర్స్‌లోకి వ‌స్తున్నాం’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement