డిప్రెషన్‌.. అందుకే దూరమయ్యా.. క్షమించండి: నజ్రియా | Nazriya Nazim Apologizes to Family, Friends, Fans | Sakshi
Sakshi News home page

Nazriya Nazim: ఆ సమస్యతో బాధపడుతున్నా.. అందువల్లే సోషల్‌ మీడియాలో మిస్సింగ్‌..

Apr 17 2025 10:51 AM | Updated on Apr 18 2025 12:41 PM

Nazriya Nazim Apologizes to Family, Friends, Fans

సెలబ్రిటీలన్నాక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు. అయితే నజ్రియా (Nazriya Nazim) మాత్రం నాలుగు నెలలుగా పత్తా లేకుండా పోయింది. సినిమాలు చేస్తోంది.. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం సైలెండ్‌ అయిపోయింది. కనీసం తన సినిమా బాగుందని ఫ్రెండ్స్‌ కాల్‌ చేస్తే కూడా ఫోన్‌ ఎత్తలేదట. ఇదంతా చూసి ఈ హీరోయిన్‌కు ఏమైంది? ఇంట్లో ఏమైనా గొడవలా? అన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

అందువల్లే మిస్సింగ్‌..
ఎట్టకేలకు కొత్త పోస్ట్‌తో అన్ని రూమర్స్‌కు చెక్‌ పెట్టేసింది నజ్రియా. అభిమానులకు, ఆప్తులకు సారీ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేసింది. అందులో నజ్రియా ఏమందంటే? నేను సామాజిక మాధ్యమాల్లో చురుకుగానే ఉండేదాన్ని. కానీ కొన్ని నెలలుగా మాత్రం సైలెంట్‌ అయిపోయాను. కారణం.. వ్యక్తిగత సవాళ్లతో సతమతమవుతున్నా.. మానసికంగాను కుంగుంబాటుకు లోనయ్యాను. దాంతో అన్నింటికీ దూరంగా ఉండాలనుకున్నాను. 

క్షమించండి
కొత్త సంవత్సరం వేడుకలను, నా 30వ పుట్టినరోజును, సూక్ష్మదర్శిని సినిమా సక్సెస్‌.. ఇలా చాలావాటిని మిస్‌ అయ్యాను. నా స్నేహితుల ఫోన్లు కూడా ఎత్తలేదు. వారి మెసేజ్‌లకు స్పందించలేదు. అందుకు వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వల్ల ఎవరైనా బాధపడుంటే.. దయచేసి క్షమించండి. అలాగే పనికోసం నన్ను సంప్రదించాలనుకున్న నా సహనటులు కూడా నన్ను మన్నించాలని వేడుకుంటున్నాను. అందరికీ కనిపించకుండా పోయి ఇబ్బందిపెట్టినందుకు సారీ..

అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..
ఇకపోతే ఉత్తమ నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్‌ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు థాంక్యూ. ఈ ప్రయాణం కష్టంగా ఉంది. కానీ దీన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను. నా పరిస్థితిని మీరందరూ అర్థం చేసుకుని అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. పూర్తి స్థాయిలో కమ్‌బ్యాక్‌ ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. లవ్‌ యూ ఆల్‌.. అని రాసుకొచ్చింది.

సినిమా
రాజారాణి సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసిన నజ్రియా.. అంటే సుందరానికి చిత్రంతో తెలుగువారిని మరోసారి ఆకట్టుకుంది. నేరం, ఓం శాంతి ఒషానా, బెంగళూరు డేస్‌, కూడె, కుంబలంగి నైట్స్‌, కూడె వంటి పలు చిత్రాలతో తమిళ, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా స్టేటస్‌ అందుకుంది. గతేడాది సూక్ష్మదర్శిని అనే మలయాళ చిత్రంతో హిట్‌ అందుకుంది.

 

 

చదవండి: నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేవారే లేరు

Advertisement
 
Advertisement
Advertisement