Naveen Polishetty Comments On Miss Shetty Mr. Polishetty Movie - Sakshi
Sakshi News home page

Naveen Polishetty: అనుష్కతో సినిమా అందుకే చేశా..

Aug 16 2023 7:02 PM | Updated on Aug 16 2023 7:33 PM

Naveen Polishetty Comments Miss Shetty Mr Polishetty Movie - Sakshi

నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే మీకు తెలియకుండానే 'ఈవ్..' అనే సౌండ్ చేస్తారు. ఎందుకంటే 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' మూవీతో హిట్ కొట్టినప్పటికీ 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఎంటర్‌టైన్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్నాడు. సెప్టెంబరు 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!)

అప్పుడు కోప్పడ్డారు
'నేను ఓ ఇంజినీర్. చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను. బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు. 'ఏజెంట్ ఆత్రేయ'కి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు. నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టైటిల్‌లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు'

అందుకే ఈ మూవీ
''జాతిరత్నాలు' ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి టైంలో ఓ మహిళా అభిమానిని కలిశాను. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్‌టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యా. అలా ఎన్నో కథలు విని.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓకే చేశాను. అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్‌లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement