నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో? | National Film Award Winning Movies OTT Streaming Details - Sakshi
Sakshi News home page

National Award Winning Movies 2023 OTT Platforms: అవార్డులొచ్చిన సినిమాల ఓటీటీ లిస్ట్ ఇదిగో!

Published Fri, Aug 25 2023 7:53 PM

National Award Winning Movies OTT Streaming Details - Sakshi

జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అలానే మిగతా దక్షిణాది భాషల్లోని చిత్రాలు సైతం అవార్డులు గెలుచుకున్నాయి.  'పుష్ప' మూవీకిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలుచుకోవడం మాత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అలానే 'ఆర్ఆర్ఆర్'కి ఏకంగా ఆరు పురస్కారాలు దక్కడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

(ఇదీ చదవండి: మహేశ్‌బాబు.. జాతీయ అవార్డు మిస్ చేసుకున్నాడా?)

అయితే చాలామంది ఎవరెవరికి ఎన్ని అవార్డులు వచ్చాయనేది చూస్తుంటే.. సినీ ప్రేమికులు మాత్రం ఏ సినిమా ఏ ఓటీటీలో ఉందా అని తెగ వెతికేస్తున్నారు. అయితే అలాంటి వాళ్ల కోసం మేం ఆ లిస్టుతో వచ్చేశాం. అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ప్రస్తుతం ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది తెలియాలంటే దిగువన లిస్ట్‌పై అలా ఓ లుక్కేసేయండి.

నేషనల్ అవార్డ్ మూవీస్- ఓటీటీ

ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (తెలుగు)

పుష్ప - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)

రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్ - జియో సినిమా (తెలుగు-హిందీ)

ఉప్పెన - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

కొండపొలం - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

ద కశ్మీర్ ఫైల్స్ - జీ5 (తెలుగు డబ్బింగ్)

చార్లి 777 - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)

గంగూబాయి కతియావాడి - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు డబ్బింగ్)

మిమీ - నెట్‌ఫ్లిక్స్ (హిందీ)

#Home - అమెజాన్ ప్రైమ్ (తెలుగు డబ్బింగ్)

షేర్‌షా - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

సర్దార్ ఉద్దామ్ సింగ్ - అమెజాన్ ప్రైమ్ (హిందీ)

కడైసి వివసయ్ - సోనీ లివ్ (తెలుగు డబ్బింగ్)

నాయట్టు - నెట్‌ఫ్లిక్స్ ‍(తెలుగు డబ్బింగ్)

(ఇదీ చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?)

Advertisement
 
Advertisement
 
Advertisement