
సూర్య కోపంగా ఉంటే ఎలా ఉంటాడో చూశాం. కానీ కూల్‌గా ఉంటే ఇలా ఉంటారంటూ చూపిస్తున్నారు ‘సరిపోదా శనివారం’ సినిమా మేకర్స్. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఇందులో నాని పాత్ర పేరు సూర్య. గురువారం ఈ సినిమా నుంచి సూర్య సెకండ్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘సండే టు ఫ్రైడే.. వయొలెన్స్‌కి ఇన్సూరెన్స్ (హింసకు బీమా) సూర్య’ అంటూ తన సెకండ్ లుక్‌ను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని.
అంటే... మిగతా రోజుల్లో కూల్‌గా ఉండే సూర్య శనివారం శత్రువుల భరతం పడతాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న విడుదల కానున్న ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: జి. మురళి.