Natural Star Nani Released First Day First Show Official Trailer - Sakshi
Sakshi News home page

First Day First Show Trailer: ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ట్రైలర్‌ చూశారా?

Aug 24 2022 6:15 PM | Updated on Aug 24 2022 7:00 PM

Nani Released First Day First Show Official Trailer - Sakshi

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడకపోతే చస్తార్రా? చచ్చిపోతార్రా? అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఖుషి ఫస్ట్‌డే ఫస్ట్‌ షో కోసం టికెట్లు తెస్తానని తన ఫస్ట్‌ లవ్‌ దగ్గర పోజు కొడతాడు హీరో.

జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోహిస్తున్న ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.  బుధవారం ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని రిలీజ్‌ చేశాడు.

'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడకపోతే చస్తార్రా? చచ్చిపోతార్రా?' అన్న తనికెళ్ల భరణి డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. కట్‌ చేస్తే జైల్లో ఉన్న హీరో నేను చస్త సర్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూడకపోతే నేను చచ్చిపోత సర్‌ అని ఆన్సరిస్తాడు. మరో సీన్‌లో ఖుషి సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో కోసం టికెట్లు తెస్తానని తను ప్రేమించే అమ్మాయి దగ్గర పోజు కొడతాడు హీరో. మరోవైపు ఈ పిచ్చి అలవాటుని మాన్పించాలని తాపత్రయపడుతున్నాడు అతడి తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ల భరణి. మొత్తానికి ట్రైలర్‌ అయితే సరదాగా కొనసాగగా.. ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల మోములపై నవ్వులు పూయిస్తోంది.

చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు
‘లైగర్‌’ ఫస్ట్‌ రివ్యూ ఇదే.. సినిమా ఎలా ఉందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement