హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో! | Nani Movie Hai Nanna Gets Oniros Awards In Eleven Parts | Sakshi
Sakshi News home page

Hai Nanna Movie: హాయ్ నాన్నకు అవార్డుల పంట.. ఏకంగా 11 విభాగాల్లో!

Apr 8 2024 9:50 PM | Updated on Apr 8 2024 9:57 PM

Nani Movie Hai Nanna Gets Oniros Awards In Eleven Parts - Sakshi

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్‌తో శౌర్యవ్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికపై మెరిసింది. న్యూయార్క్‌లో జరిగిన ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది. పలు విభాగాల్లో మొత్తం 11 అవార్డులను కైవసం చేసుకుంది. 

ఒనిరోస్‌ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్‌ ట్రాక్‌, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో 11 అవార్డులు గెలుచుకుంది. కాగా.. ఈ చిత్రాన్ని హాయ్‌ డాడీ పేరుతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు అవార్డ్స్ దక్కడం పట్ల డైరెక్టర్‌ ఆనందం ‍వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement