NBK108 : అనిల్‌ రావిపూడితో బాలయ్య యాక్షన్‌ సినిమా ప్రారంభం | Nandamuri Balakrishna Film With Anil Ravipudi Has Launched | Sakshi
Sakshi News home page

NBK108 : అనిల్‌ రావిపూడితో బాలయ్య యాక్షన్‌ సినిమా ప్రారంభం

Dec 8 2022 4:46 PM | Updated on Dec 8 2022 5:02 PM

Nandamuri Balakrishna Film With Anil Ravipudi Has Launched - Sakshi

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో NBK108 అనే క్రేజీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. ముహూర్తం షాట్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు.

ముహూర్తం షాట్‌కి లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌  కూడా నేడు(గురువారం)ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య ఇంతకుముందెప్పుడూ కనిపించని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారట. శ్రీలీల ఇందులో కీలక పాత్రలో నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement