పొరపాటు దిద్దుకున్న నాగార్జున, వీడియో వైరల్‌ | Nagarjuna Meet And Apologizes To Differently Abled Fan, Who Got Pushed By Hero Bodyguard, Video Viral | Sakshi
Sakshi News home page

ఆ అభిమానిని కలిసి సెల్ఫీ దిగిన నాగ్‌.. తప్పు నీది కాదంటూ..

Jun 26 2024 4:05 PM | Updated on Jun 26 2024 5:45 PM

Nagarjuna Meet Fan, Who Got Pushed By Hero Bodyguard

సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోలు తీసుకోవాలని ఎవరికి ఉండదు? అందులోనూ అభిమాన తార కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఒక్క సెల్ఫీ అంటూ వెంటపడతారు. ఫోటో క్లిక్‌మనిపించే అవకాశం ఇస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. కానీ ఆ తారల పక్కన ఉన్న బాడీగార్డులు అభిమానులను దగ్గరకు కూడా రానివ్వరు. ఇంకా సెల్ఫీలు, వీడియోలని అడిగితే మాత్రం నిర్దాక్షిణ్యంగా అవతలకు నెట్టేస్తారు.

ఇటీవల కింగ్‌ నాగార్జున అభిమానికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఎయిర్‌పోర్టులో దిగిన నాగ్‌ను చూసిన ఓ అభిమాని సెల్ఫీ అంటూ ముందుకొచ్చాడు. పెద్దాయన అని కూడా చూడకుండా నాగ్‌ బాడీ గార్డ్‌ ఆయనను గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడబోయిన ఆయన తమాయించుకుని నిలబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా నాగ్‌ క్షమాపణలు చెప్పాడు. తాను అదంతా గమనించలేదని, ఇంకోసారి ఇలాంటిది జరగనివ్వనని మాటిచ్చాడు.

తాజాగా మరోసారి ఎయిర్‌పోర్టుకు వెళ్లిన నాగ్‌ అక్కడే ఉన్న తన అభిమానిని పలకరించాడు. హగ్గిచ్చి సెల్ఫీ దిగాడు. మొన్న జరిగినదాంట్లో నీ తప్పు లేదు.. మా వాళ్లే తప్పుగా ప్రవర్తించారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసిన అభిమానులు.. అక్కడున్నది మా కింగ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: రాజమౌళి దంపతులకు ఆస్కార్‌ నుంచి ఆహ్వానం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement