నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం | Nagarjuna Invite CM Revanth Reddy To Akhil Wedding | Sakshi
Sakshi News home page

Nagarjuna: అఖిల్ పెళ్లి.. ముఖ్యమంత్రిని ఆహ్వానించిన నాగ్

May 31 2025 12:54 PM | Updated on May 31 2025 3:18 PM

Nagarjuna Invite CM Revanth Reddy To Akhil Wedding

అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్.. ఈ జూన్‪‌లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. జూన్ తొలివారంలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడని అంటున్నారు. ఇదలా ఉండగానే ఇప్పుడు నాగ్ వైపు నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

శనివారం ఉదయం.. నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడి వివాహానికి సీఎంని ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాగార్జున-అమల దంపతులకు పుట్టిన సంతానం అఖిల్. ఇప్పటికే హీరోగా ఐదు సినిమాలు చేశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అఖిల్ నిశ్చితార్థం జరిగి రద్దయింది. దీంతో గతేడాది ఎలాంటి హడావుడి లేకుండా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లికి రెడీ అయిపోయాడు.

(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్‌)

Advertisement
 
Advertisement
Advertisement