
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.
ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్‌లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.
అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్‌లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.
#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024