బిగ్‌బాస్‌ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్‌.. మరి బజ్‌ హోస్ట్‌? | Nagarjuna Akkineni Launched Bigg Boss 9 Telugu Logo, Watch Promo Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Bigg Boss 9 Telugu: యుద్ధం చేస్తే సరిపోదు, ప్రభంజనం సృష్టించాలంటున్న నాగార్జున

Jun 27 2025 8:21 AM | Updated on Jun 27 2025 10:18 AM

Nagarjuna Akkineni Launched Bigg Boss 9 Telugu Logo, Watch Promo

బిగ్‌బాస్‌ 9 (Bigg Boss Season 9).. ఆగమనానికి సర్వం సిద్ధమవుతోంది. తాజాగా బిగ్‌బాస్‌ 9 లోగోనూ లాంచ్‌ చేస్తూ ప్రోమో రిలీజైంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటున్నాడు కింగ్‌ నాగార్జున. ఈసారి కూడా హోస్ట్‌ నాగార్జునే అన్న విషయం ప్రోమోతో స్పష్టమైపోయింది.

బజ్‌ హోస్ట్‌గా..
కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. కిర్రాక్‌ బాయ్స్‌ కిలాడీ గర్ల్స్‌ సీజన్‌ 2లో ఉన్నవారిలో చాలామంది ఈ షోలో భాగం కానున్నారు. అలాగే ఈ వారం మొదలవుతున్న కూకు విత్‌ జాతిరత్నాలు కామెడీ షోలోని కంటెస్టెంట్లు కూడా బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్‌ చేయనున్నారు. అటు బిగ్‌బాస్‌ బజ్‌ హోస్ట్‌గా ప్రేరణ కంభాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో బిగ్‌బాస్‌ 9 షురూ కానుంది.

 

చదవండి: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్‌ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement