Naga Shourya: అప్పుడు పాన్‌ వరల్డ్‌ సినిమా అవుతుంది: నాగశౌర్య

Naga Shourya Comments At Krishna Vrinda Vihari Movie Promotions - Sakshi

‘‘పాన్‌ ఇండియా సినిమా చేయాలంటే మంచి కథ కుదరాలి.. అంతేకానీ మనం పాన్‌ ఇండియాకి ప్లాన్‌ చేయకూడదు. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే పాన్‌ వరల్డ్‌ చూస్తారు. అప్పుడు అది పాన్‌ వరల్డ్‌ సినిమా అవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు డామినేటింగ్‌గా ఉన్న సమయంలో మేము ఉండటం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు నాగశౌర్య. అనీష్‌ ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య, షిర్లే సేథియా జంటగా నటించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు. 

⇔ ‘కృష్ణ వ్రింద విహారి’ కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించడంతో అనీష్‌కి ఓకే చెప్పాను. మంచి ఫన్, ఫ్యామిలీ, మాస్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. సినిమా చూసినవారు తమ ఫ్యామిలీతో రిలేట్‌ చేసుకుంటారు. కుటుంబం ఉన్నంతవరకూ మా ‘కృష్ణ వ్రింద విహారి’లాంటి కథలకు తిరుగులేదు. ఈ సినిమాలో రాధికగారి పాత్ర మినహా మిగతా పాత్రలన్నీ హిలేరియస్‌గా ఉంటాయి.

⇔ ‘అదుర్స్, డీజే, అంటే సుందరానికీ’.. ఇలా ఎన్నో సినిమాల్లో బ్రాహ్మణ పాత్రలు ఉన్నప్పటికీ దేనికదే భిన్నమైనది. ‘కృష్ణ వ్రింద విహారి’ కూడా భిన్నమైన కథ. కమల్‌హాసన్, ఎనీ్టఆర్, అల్లు అర్జున్‌గార్లు.. వంటి వారు బ్రహ్మణ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు స్వతహాగా బ్రాహ్మణుడైన అవసరాల శ్రీనివాస్‌ వద్ద కొన్ని విషయాలు నేర్చుకున్నాను. రొమాంటిక్‌ సీన్స్‌లో నేను చాలా వీక్‌ (నవ్వుతూ).. మా దర్శకుడు కష్టపడి చేయించారు.  

⇔ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన పాద యాత్రలో ప్రేక్షకుల అభిమానం ఒక వరం అనిపించింది. ఇక నేను నటించిన ‘ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి’ షూటింగ్‌ పూర్తయింది.. త్వరలో విడుదల చేస్తాం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top