
కొత్త సినిమా కోసం సరికొత్తగా మారిపోయారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎన్‌సీ (నాగచైతన్య) 24–ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్’ (తవ్వకం ఆరంభం) అంటూ ఈ సినిమాకు చెందిన స్పెషల్ వీడియోను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రీప్రొడక్షన్ వర్క్స్, సెట్ వర్క్స్, రిహార్శల్స్, సాంకేతికమైన పనుల ప్రీ వర్క్స్ వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య శారీరకంగా, మానసికంగా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. అద్భుతమైన కథ, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమేరా: నీల్ డి. కున్హా.