కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Naga Chaitanya Vrishakarma is slated to release on December 4 | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Oct 16 2026 5:34 AM | Updated on Oct 16 2026 5:34 AM

Naga Chaitanya Vrishakarma is slated to release on December 4

‘తండేల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, స్పర్‌‡్ష శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 కాగా ‘వృషకర్మ’ విడుదలకి సరిగ్గా 50 రోజుల కౌంట్‌డౌన్‌ మొదలైందని చిత్రయూనిట్‌ ప్రకటించి, నాగ చైతన్య సరికొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. ‘‘మిథికల్‌ థ్రిల్లర్‌గా రూ పొందుతోన్న చిత్రం ‘వృషకర్మ’. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్‌ వంటి అంశాలతో ఎవరూ టచ్‌ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రం మునుపెన్నడూ చూడని మంచి అనుభూతిని ప్రేక్షకులకు అందించేలా ఉంటుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య డిఫరెంట్‌ రోల్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అజనీష్‌ బి. లోక్‌నాథ్, కెమెరా: రాగుల్‌ డి. హెరియన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement