
‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆరంభమైనట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఎన్‌సీ 24’. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన గుహ సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం. రషెస్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మరింత ఉత్సాహంతో హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించాం.
ముప్పై రోజుల పాటు హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్యతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. చైతన్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: రాగుల్ ధరుమన్.