Naga Babu Reacts on Niharika Konidela Instagram Account - Sakshi
Sakshi News home page

Naga Babu: నిహారిక ఇన్‌స్టా అకౌంట్‌ డిలీట్‌పై నాగబాబు కామెంట్స్‌ వైరల్‌

Mar 22 2022 12:44 PM | Updated on Mar 22 2022 1:37 PM

Naga Babu Reacts on Niharika Konidela Instagram Account - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయంపై అయినా తనదైన స్టైల్‌లో సమాధానమిస్తుంటాయరన. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే ఓ యూజర్‌ నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఎందుకు డిలీట్‌ చేసింది?ఆ రూమర్స్‌పై రెస్పాండ్‌ అవ్వండి అని అడిగారు.

దీనికి రిప్లై ఇచ్చిన నాగబాబు.. 'నిజానికి నేనే కోడింగ్‌ నేర్చుకొని అకౌంట్‌ హ్యక్‌ చేసి అకౌంట్‌ డియాక్టివేట్‌ చేశాను. మళ్లీ డీకోడింగ్‌ నేర్చుకొని అకౌంట్‌ రీ యాక్టివ్‌ చేస్తాను' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక కొన్ని రోజుల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్‌ని డిలీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి. కానీ నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టా నుంచి ఇద్దరి ఫోటోలు షేర్‌ చేస్తూ ఆ రూమర్స్‌కి చెక్‌ పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement