కిష్టయ్య.. అంజి.. ఓ మంచి స్నేహం  | Naa Saamiranga movie release on January 13 | Sakshi
Sakshi News home page

కిష్టయ్య.. అంజి.. ఓ మంచి స్నేహం 

Jan 6 2024 1:53 AM | Updated on Jan 6 2024 7:00 AM

Naa Saamiranga movie release on January 13 - Sakshi

‘‘దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం. అంజిది.. కిష్టయ్యది... వీడదీయని ఒక బంధం.. చిరునవ్వులు పూసే స్నేహం.. చిరుగాలికి ఈలల పాఠం’’ అంటూ సాగుతుంది ‘నా సామిరంగ’ సినిమాలోని ‘విజిల్‌ థీమ్‌ సాంగ్‌’. నాగార్జున హీరోగా, ‘అల్లరి’ నరేశ్, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నా సామిరంగ’.

ఈ సినిమాలో కిష్టయ్య పాత్రలో నాగార్జున, అంజి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, భాస్కర్‌ పాత్రలో రాజ్‌ తరుణ్, వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్, కుమారి పాత్రలో రుక్సార్, మంగ పాత్రలో మిర్నా మీనన్‌ నటించారు. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా శుక్రవారం ‘విజిల్‌ థీమ్‌ సాంగ్‌’ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాటకు ఈ చిత్రసంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సాహిత్యం అందించగా, శాండిల్య పిసాపాటి పాడారు.

Advertisement
 
Advertisement
Advertisement