వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి | Music Director Koti Reacts Keeravani Padutha Theeyaga Issue | Sakshi
Sakshi News home page

Koti: దర్శకుడు గీతాకృష్ణకు వీడియోతో కౌంటర్ ఇచ్చిన కోటి

Apr 27 2025 9:06 PM | Updated on Apr 27 2025 9:06 PM

Music Director Koti Reacts Keeravani Padutha Theeyaga Issue

గత కొన్నిరోజులుగా 'పాడుతా తీయగా' షో వివాదం నడుస్తోంది. ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు సింగర్స్ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. గీతాకృష్ణ అనే దర్శకుడు కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ని ఇక ఆపమని చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ వీడియో రిలీజ్ చేశారు.

'గీతాకృష్ణ.. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేశారు. కె.విశ్వనాథ్ దగ్గర శిష్యరికం కూడా చేశారు.కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువవుతోంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మనందరం ఓ ఫ్యామిలీ. ఇక్కడ తప్పేం జరిగిపోలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది'

(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు)   

'కానీ ఇలా వ్యక్తిగతంగా మనుషులపై కామెంట్స్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న అవాంతరాలు వస్తుంటాయి. నేను చేసిన వాటిలోనూ వచ్చాయి. అక్కడితో మర్చిపోతారు. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి. నాకు బాధేస్తోంది'

'ప్లీజ్.. ఇక ఈ విషయంలో ఏదీ మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందోనని నాకు భయమేస్తోంది' అని కోటి చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement