ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Murder In Mahim Web Series Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

Murder In Mahim: ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్‌ క్రైమ్ థ్రిల్లర్‌.. వారు మాత్రమే చూసే ఛాన్స్!

May 7 2024 4:09 PM | Updated on May 7 2024 7:03 PM

Murder In Mahim Web Series Streaming On This OTT Platform

అసలే వేసవికాలం.. బయటచూస్తే మండుటెండలు భయపెట్టేస్తున్నాయి. స్కూళ్లకు సైతం సెలవులు రావడంతో పిల్లలు సైతం ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూసేందుకు ఓటీటీలపై ఎ‍క్కువగా ఆధారపడుతున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసం ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి.

తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ జానర్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఈ క్రమంలోనే మర్డర్ ఇన్ మహిమ్ అనే పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అలరించేందుకు సిద్ధమైంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ వెబ్ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ఈనెల 10 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఏకంగా ఆరు భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది కేవలం జియో సినిమా ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement