
బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా సీతారామం సినిమాతోనే ఈమెకు పాపులారిటీ పెరిగింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆ భామ సీతారామం సక్సెస్‌తో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది.
ఇప్పటికే నాచురల్ స్టార్ నాని సరసన ఛాన్సు కొట్టేసిన మృణాల్ ఠాకూర్ తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఫైనలైజ్ అయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు టాక్ వినిపిస్తుంది.